ఉప్పాడ మత్స్యకారుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ స్పందన — 100 రోజుల్లో శాశ్వత పరిష్కారం హామీ

ఉప్పాడ (తూర్పు గోదావరి), అక్టోబర్ 9:

ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప్పాడ మండలానికి చేరుకుని అక్కడి మత్స్యకార కుటుంబాలతో సమావేశమయ్యారు. గత నెలలో జరిగిన నాలుగు రోజుల ఆందోళనకు స్పందిస్తూ ఆయన “తప్పక వస్తాను, మాట్లాడుతాను” అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ఉప్పాడ మండలంలో  మత్స్యకార కుటుంబాలు చేపల వేటకే ఆధారపడి జీవిస్తున్నాయి. వీరి సమస్యలను సమీక్షించేందుకు కలెక్టర్ తదితరులతో కలిసి కాకినాడ కలెక్టరేట్ లో  సమావేశమయ్యారు.

ప్రధానంగా చర్చించిన అంశాలు

1. పరిశ్రమల వల్ల సముద్ర కాలుష్యం

ఉప్పాడ సముద్ర తీరంలో చేపల సంఖ్య తగ్గిపోవడానికి కారణంగా డెక్కన్ కెమికల్స్, దివి ల్యాబొరేటరీస్ మరియు ఇతర చిన్న స్థాయి పరిశ్రమలు ఫిల్టర్ లేకుండా వ్యర్థాలను సముద్రంలోకి వదలడం కారణమని మత్స్యకారులు వివరించారు.

పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై ప్రమాద ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, కాలుష్య ఆడిట్ నిర్వహించి, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “పరిశ్రమలు ఉండాలి, కానీ వాటి వల్ల సముద్ర జీవితం నాశనం కాకూడదు” అని స్పష్టం చేశారు.

2. మత్స్యకారుల మధ్య వివాద పరిష్కారం

చేపల కొరత కారణంగా ఉప్పాడ మత్స్యకారులు మచిలీపట్నం, నర్సాపురం, అంతర్వేది ప్రాంతాలకు వెళ్ళి చేపల వేట చేస్తున్నారు. దీని వల్ల ప్రాంతీయ మత్స్యకార సంఘాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ నాలుగు ప్రాంతాల మత్స్యకార నాయకులతో సమస్య పరిష్కార చర్చలు జరిపి, పరస్పర అవగాహనకు వచ్చారు. ఇకపై ఉప్పాడలో చేపలు దొరకని సమయంలో, ఉప్పాడ మత్స్యకారులు ఇతర తీరప్రాంతాలకు వెళ్లి వేట చేయడానికి అనుమతి ఉంటుందని నిర్ణయించారు.

3. అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపాలు

మత్స్యకారులు అమీనాబాద్ హార్బర్ నిర్మాణంలో ఉన్న డిజైన్ లోపాలను ప్రస్తావించారు. వాటి వల్ల నౌకలు సరిగా ఆగలేకపోవడం, సౌకర్యాలు లేకపోవడం జరుగుతోందని తెలిపారు.

పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని షిప్పింగ్ అండ్ హార్బర్ మంత్రిత్వ శాఖతో చర్చించి సరిచేయిస్తామని చెప్పారు.

4. సముద్ర తీర రక్షణ గోడ (Sea Protection Wall)

అత్యంత కీలకమైన అంశం — ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రం గ్రామాలను మింగేస్తున్నది. ప్రతి సంవత్సరం 1–2 కిలోమీటర్ల తీరరేఖ సముద్రంలో కలిసిపోతుంది, దాంతో 25–30 ఇళ్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదిత సముద్ర రక్షణ గోడ ప్రాజెక్టు ఖర్చు రూ. 323 కోట్లు. కానీ ప్రస్తుతం కేంద్రం నుండి కేవలం రూ. 250 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. మిగిలిన నిధుల కోసం అక్టోబర్ 14న జరగబోయే చర్చలలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

“నేను ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ గారితో, అమిత్ షా గారితో నేరుగా మాట్లాడి పూర్తి ఆమోదం తీసుకుంటాను” అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.

పవన్ కళ్యాణ్ గారి హామీలు

• “నేను మాంత్రికుడు కాదు, ఒక్కరోజులో సమస్యలు పరిష్కరించలేను, కానీ 100 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తాను” అని అన్నారు.

• తాత్కాలికంగా డబ్బులు ఇవ్వడం తన విధానం కాదని, శాశ్వత నిర్మాణాత్మక పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

• వచ్చే 2–3 రోజుల్లో కాలుష్య ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమావేశమై చర్యలు ప్రారంభిస్తానని చెప్పారు.

పవన్ కళ్యాణ్ గారి భావోద్వేగ ప్రసంగం

“నేను ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కాదు — మీలో ఒకడిని. నేను కూడా మత్స్యకారుడిననే భావనతో మీ సమస్యలను చూస్తున్నాను. మీరు నా కుటుంబసభ్యుల్లా ఉన్నారు, కాబట్టి మీ బాధ నా బాధ.” మీరు నన్ను విమర్శించినా, మీ కోసం నేనే పోరాడుతాను,అని సమస్యను పరిష్కరించడానికి తనకు 100 రోజుల సమయం పడుతుందని కాని శాశ్వతమైన ఫలితం ఉంటుందని తెలిపారు

పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులను ఒకటిగా ఉండమని కోరుతూ, ఉప్పాడ తీరరక్షణ గోడ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. “

తాజా వార్తలు చదవండి :